ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రజల సొమ్మును పార్టీ అవసరాలకు ఉపమోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఉపయోగిస్తే మళ్లీ తిరిగి రాబట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.