గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వేనం. 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో 308/2017 చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది.
బోటు యజమానిపై గతంలోనూ కేసులు
Sep 19 2019 12:40 PM | Updated on Sep 19 2019 12:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement