వైమానిక దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.