వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం | Fish Medicine Distribution In Hyderabad On June 8 & 9 | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం

May 29 2019 7:49 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు.

Advertisement
 
Advertisement
Advertisement