హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది రేపు (మంగళవారం) హుజూర్‌నగర్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో వెల్లడిస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరి వారు కాదని, వారి సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలు సరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.