కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు.