మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు టోకరా వేశాడు. దీంతో పాటు ఫిబ్రవరి 9న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు చివరికి పోలీసులకు చిక్కాడు.