ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు ఉన్మాది అనటంపై ఎమ్మెల్యే జోగి రమెష్ తీవ్రంగా మండిపడ్డారు. మనసున్న సీఎం జగన్‌ను ఉన్మాది అంటారా.. లేక ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసిన చంద్రబాబును ఉన్మాది అంటారా.. తెసుకోవాలని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ బయట మార్షల్స్‌లో గొడవ పడుతూ.. సీఎం గురించి ఆ భాషలో మాట్లాడవల్సివ అవసరం లేదని రమేష్ దుయ్యబట్టారు.