గురువారం గుంటూరులో చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మైకు చేతపట్టి చేసిన ప్రసంగంతో సభకు వచ్చిన వారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. రాజధానిలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీతో అక్కడి సభికులను విస్మయపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇంటింటికి ఏసీ ఏంది బాబు’., ‘ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు బాబూ’అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఇంకా నయం ఏడు కొండలు ఏసీ చేస్తాననలేదు..’అంటూ మరి కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.