పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభంం

వివాహ వేడుకకు హాజరైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కళ్యాణ మంటపం దగ్గర నిల్చున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మహిళ వెనకే నిల్చున్న ఆ వ్యక్తి అదును చూసి మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన మహిళను పక్కకు తోసి బయటకు పారిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో షాక్‌కు గురయిన మహిళ తేరుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోపే నిందుతుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top