పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు | Car Accident At Prakasam District | Sakshi
Sakshi News home page

పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Nov 4 2019 2:23 PM | Updated on Mar 22 2024 10:57 AM

జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు  అక్కడికి చేరుకుని కారులోని వారిని  సురక్షితంగా బయటకు లాగారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరిని దగ్గరలోని ప్రభుత్వ  ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. 
 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement