ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. | Bus Derailed st Vijayawada Paidurupadu | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు బోల్తా..

Dec 15 2017 9:36 AM | Updated on Mar 22 2024 11:27 AM

నగర శివార్లలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. పైడూరుపాడు వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కు చెందిన బస్సు బోల్తా పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల కారణంగా అడ్డదారిలో వెళ్తుండగా పైడూరుపాడు వద్ద బస్సు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మిగతా ప్రయాణికులను గొల్లపూడి నుంచి వేరే బస్సులో తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement