కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కర్ణాటకలో బీజేపీ ప్రభంజనంపైస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా ఆయన ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి గత ఎన్నికలతోపోలిస్తే 6నుంచి 20కిపైగా సీట్లు పెరిగాయన్నారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్ చేశారు.