తహసీల్దార్‌ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’ | Bhuvanagiri Revenue Staff Faces Bitter Experience | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’

Nov 5 2019 1:51 PM | Updated on Mar 22 2024 10:57 AM

సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది.
 

నిరసనకు దిగిన సిబ్బందిని  అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్‌ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement