సీఎం రోడ్డుట్రిప్పు.. మీరు గ్రేట్‌ సార్‌! | Arunachal CM goes on a bike ride to promote tourism | Sakshi
Sakshi News home page

సీఎం రోడ్డుట్రిప్పు.. మీరు గ్రేట్‌ సార్‌!

Oct 16 2019 10:43 AM | Updated on Mar 21 2024 8:31 PM

‘లీడర్‌’ సినిమాలో అర్జున్‌ ప్రసాద్‌.. అదేనండీ హీరో రానా దగ్గుబాటి సీఎం హోదాలో బైక్‌ వేసుకుని రోడ్లపై తిరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌ కోరిక మేరకు ఆమెను సరదాగా బైక్‌పై బయటకు తీసుకువెళ్తాడు మన యంగ్‌ సీఎం. అదంతా రీల్‌లైఫ్‌ అయితే రియల్‌ లైఫ్‌లోనూ అలాంటి యంగ్‌ సీఎం ఒకరు రోడ్డుపై బైక్‌తో చక్కర్లు కొట్టారు. అయితే ఆయన కేవలం సరదా కోసం బైక్‌ రైడింగ్‌ చేయడం లేదు. రాష్ట్ర పర్యాటక రంగం ప్రమోషన్లలో భాగంగా రయ్‌మంటూ బైక్‌పై దూసుకుపోతూ కాన్వాయ్‌ను పరుగులు పెట్టించారు. ఆయనే అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు(40). కాగా ప్రకృతి అందాలకు నెలవైన అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement