ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం పూర్తిగా రాజకీయం అయింది. ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి 10 ఏళ్లు హోదా కావాలని ఎవరు అడగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ స్పష్టం చేసినప్పటికీ ఉద్యమాలు చేయడం వృధా.. ఉద్యమాల వల్ల ప్రజలు నష్టపోతారు.హోదా కోసం ఉద్యోగులు పోరాడితే వ్యవస్థ దెబ్బతింటుంది.. విభజన చేయమని లేఖలు ఇచ్చిన పార్టీలే.. నేడు హోదా కోసం పోరాడటం హాస్యాస్పదం.. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడిన సమయంలో పోరాటాలు, ఉద్యమాలు చేయడం సబబు కాద’ని అశోక్‌బాబు వ్యాఖ్యలు చేశారు.
అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు
Apr 24 2018 4:39 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement