మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..