చంద్రబాబు ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవని, నిర్లజ్జగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి, ఇప్పుడైన నిజాలు చెప్పాలంటూ దుయ్యబట్టారు.