టాలీవుడ్ సైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ లైఫ్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తాడన్న విషయం తెలిసిందే. సెలవులు, పండుగలను కుటుంబ సభ్యులతో గడపడంమంటే బన్నీకి ఎంతో సరదా. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా బన్నీ షేర్ చేసిన వీడియా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.