333వ రోజు పాదయాత్ర డైరీ | 333rd day padayatra diary | Sakshi
Sakshi News home page

333వ రోజు పాదయాత్ర డైరీ

Dec 31 2018 11:06 AM | Updated on Mar 22 2024 11:16 AM

ఈరోజు వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పాదయాత్ర చేశాను. ఈ సందర్భంగా నువ్వలరేవు గ్రామానికి చెందిన కేవిటి కులస్తులు కలిశారు. పదివేల మంది ఉన్న ఈ గ్రామంలో అంతా ఒకే కులస్తులట. ఇది వరకు వాళ్లకు కుల ధ్రువీకరణే లేదు. నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పరిస్థితి ఆయన దృష్టికొచ్చింది. వాళ్లు పడే ఇబ్బందులు కళ్లారా చూశారు. అధికారంలోకి రావడంతోనే వాళ్లను బీసీ–ఏ జాబితాలో చేర్చారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వారంతా ఈ రోజు నా వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. నిజంగా వాళ్ల ఆచార, వ్యవహారాలు గమ్మత్తుగా అన్పించాయి. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన పిల్లలంతా ప్రతి రెండేళ్లకోసారి సామూహిక వివాహాలు చేసుకుంటారట. ఇలా ప్రతి ఇల్లు పచ్చతోరణం కట్టుకోవడం.. ఏక కాలంలో వివాహాలు జరగడం వల్ల వాళ్లకు ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. నేస్తరికం పేరుతో వాళ్లు జరుపుకునే వేడుకలు స్నేహపూర్వక ధోరణికి అద్దం పడుతున్నాయి. నిజంగా వాళ్ల సంప్రదాయ ధోరణులు సమాజానికి స్ఫూర్తినిస్తాయనేది నా విశ్వాసం. చేపల వేటే జీవనాధారమైన ఈ కులస్తులనూ సమస్యలు వెంటాడుతున్నాయి. జెట్టీ లేక చేపల వేటే కష్టమైందని.. కోల్డ్‌స్టోరేజీలు లేక దళారుల చేతుల్లో మోసçపోతున్నామన్న వాళ్ల ఆవేదన బాధ కలిగించింది.  

Advertisement
 
Advertisement
Advertisement