ఇవాళ ఇద్దరు మహనీయులు.. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించాను. వారి స్ఫూర్తి తరతరాలకు వెలుగుబాటే. విజయనగరం మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే కుయుక్తులు పన్నుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు ఆధారపడ్డ పారిశుద్ధ్య సేవలను ప్రైవేటుపరం చేసి, బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ లంచాల కోసం తమ కడుపు కొడుతున్నారని కంటతడిపెట్టారు. ఆ వృత్తిలో అత్యధికులు దళితులే. ‘ఓ వైపు మా జీవితాలను చీకటిమయం చేస్తూ, మరోవైపు దళిత తేజం అనడం వంచన కాదా’అని ప్రశ్నించారు.
276వ రోజు పాదయాత్ర డైరీ
Oct 3 2018 6:57 AM | Updated on Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement