కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు బయటపడటంతో విద్యార్థులు ఆహారం తినేందుకు నిరాకరించారు.
దీంతో వండిన అన్నం మొత్తాన్ని పారేసి, మళ్లీ బియ్యం జల్లించి పురుగులు తొలగించి తిరిగి అన్నం వండారు.
ఫలితంగా మధ్యాహ్నం వడ్డించాల్సిన భోజనం సాయంత్రం మూడు గంటలకు మాత్రమే విద్యార్థులకు అందించారు.