ఇస్లాంపురంలో అరాచకం.. మహిళలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు, పోలీసులు! | Chaos in Islampuram: TDP Cadre and Police Block Women from Voting | Sakshi
Sakshi News home page

ఇస్లాంపురంలో అరాచకం.. మహిళలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు, పోలీసులు!

Nov 1 2026 8:33 PM | Updated on Nov 1 2026 8:33 PM

పులివెందుల పట్టణంలో పోలింగ్ సరళి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని ఇస్లాంపురం 11, 12 వార్డుల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇస్లాంపురం పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మైనారిటీ మహిళలను టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మహిళల చేతిలోని ఓటర్ స్లిప్పులను బలవంతంగా లాక్కుని, వారిని ఓటు వేయనీయకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ వెనక్కి పంపిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement