Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tdp False Allegations On Furniture In Ys Jagan Camp Office
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి

సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్‌ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్‌ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

Sakshi Editorial On Chandrababu Andhra Pradesh Politics By Vardhelli Murali
రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు!

ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్‌ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్‌ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్‌ బుక్‌? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్‌ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్‌ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది.ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్‌ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్‌ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్‌ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసుకున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్‌’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్‌’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్‌ డౌన్‌’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్‌ నెంబర్‌వన్‌ బీజేపీ, ఛాంపియన్‌ నెంబర్‌ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు, మెగా రిచ్‌ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్‌ డౌన్‌ ఎకనామిక్స్‌ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్‌ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్‌ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Problem with lack of coordination between Metro, MMTS and Citybuses
దరి చేర్చని దారి!.. గ్రేటర్‌లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్‌ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్‌ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్‌ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్‌ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్‌లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్‌ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్‌ చానల్స్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్‌ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్‌ లైనర్‌ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్‌ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్‌ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్‌ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్‌ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఆర్‌ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్‌లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్‌ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్‌ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్‌ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్‌ మొబిలిటీ టికెట్‌ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ టికెట్‌ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్‌బీనగర్‌– నాగోల్‌ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్‌అండ్‌టీ మెట్రో చీఫ్‌ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్‌ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్‌ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్‌ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్‌ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్‌ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, రంగారెడ్డి

India vs Canada abandoned without toss owing to wet outfield
T20 World Cup 2024: వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌-కెనడా మ్యాచ్‌ రద్దు

టీ20 వరల్డ్‌కప్‌-2024లో మరో మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా శనివారం భారత్‌-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. భారీ వర్షం కారణంగా స్టేడియం ఔట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్‌లు ఆటగాళ్లు భద్రత(గాయాల బారిన పడకుండా) దృష్ట్యా.. చివరికి మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్‌ పడకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దుచేశారు.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. కాగా ఇదే స్టేడియంలో శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటికే టీమిండియా సూపర్‌-8లో అడుగుపెట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ అద్భుత విజయాలు నమోదు చేసింది. ఇక సూపర్‌-8లో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్‌ వేదికగా జూన్‌ 20న తలపడనుంది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

Darshan And Pavitra Jayaram Issues In Tollywood Sandalwood
చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!

సినిమాలో హీరోహీరోయిన్‌కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?దర్శన్ కేసుకన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్‌గా చెప్పుకొంటే.. దర్శన్‌కి ఇదివరకే విజయ్ లక్ష‍్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పవిత్ర-చందు మరణాలుతెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్‌కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.డ్రగ్స్ కేసులో హేమ టాలీవుడ్‌లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్‌గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటి..?)

KSR Comments On Chandrababu Naidu's Opposition Behavior Towards Higher Officials
‘బాబు.. అధికారులను అవమానించడం సమంజసమేనా?’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.కౌంటింగ్‌లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్‌సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్‌లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Uddav Thackeray Comments On Shinde Shivsena
ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్‌

ముంబై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన(ఉద్ధవ్‌) అధినేత ఉద్ధవ్‌ థాక్రే సెటైర్లు వేశారు. గతంలో మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవిస్‌ కామెంట్‌ చేయడాన్ని ఉద్ధవ్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది రిక్షా పరిస్థితేనని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తెలియదు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి మా పార్టీలో చోటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోం. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీయే అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైంది’అని ఉద్థవ్‌ తెలిపారు.

Joe Biden And Donald Trump Race On President Role
గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ వర్సెస్‌ ట్రంప్‌

జో బైడెన్‌. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపబడుతున్నారు. వైట్‌ హౌస్‌ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్‌ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్‌ లీడర్‌ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక నాలుగేళ్లు ట్రంప్‌ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్‌ బైడెన్‌కి, రిపబ్లికన్స్‌ ట్రంప్‌కి జై కొట్టేశారు. ఇంత వరకు బానే ఉంది. కానీ...గత అధ్యక్షులతో పోల్చితే...సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే...కేవలం ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్‌ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్‌ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా..వరల్డ్‌ వైడ్‌గా చర్చ సాగుతోంది.నిజానికి జో బైడెన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రజలకి కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్‌తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు.అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా వరల్డ్‌ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు...జో బైడెన్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్‌ సంగతి సరే. ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్‌ వయసంటూ లేదు. బైడెన్‌ వయస్సు 81. ట్రంప్‌ వయస్సు 78. ఆ వయస్సు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరిక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపు బైడన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా జీ-7 దేశాల సదస్సులో బైడెన్‌ వింతగా ప్రవర్తించడంతో...మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.అది.. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియా. జీ7 సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్‌ చేస్తున్న వారిని పలకరించారు. కానీ.. అదే సమయంలో జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే.. బైడెన్‌ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్‌ మెజార్టీ లీడన్‌ చక్‌ షూమర్‌ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఉన్న మిగితా వారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అప్పటికి తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. కాసేపు అలాగే షేక్‌ హ్యాండ్‌ పొజిషన్‌లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్‌.కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండి పోయారు. ఏం జరుగుతుందో అర్ధం కానట్లు చూస్తుండిపోయారు. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండిపోయిన బైడెన్‌ ఆ తర్వాత తేరుకున్నారు.ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలోనూ బైడెన్‌ దొరికిపోయారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు సైతం మర్చిపోయారు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు బైడెన్‌ తీరు అధికార డెమొక్రాటిక్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే బైడెన్‌ ప్రవర్తనని...రిపబ్లికన్‌ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఇకపై ప్రచారంలో దీన్ని ఒక కీలక అస్త్రంగా మార్చుకోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ని...గన్‌ కొనుకోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. అటు ట్రంప్‌ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు. హష్‌ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్‌ వయస్సు కూడా 78 ఏళ్లు కావడంతో...వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీదా చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్‌ పాయింట్‌గా మారింది.క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి... తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్‌. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడుగా ట్రంప్‌కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడి వేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్‌, ట్రంప్‌ మధ్య నెగిటివ్‌ వైబ్రేషన్స్‌ బలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య వాడి వేడి సమరం తప్పదని ఎన్నికల సాగుతోన్న తీరు చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్‌ కన్నా ట్రంప్‌ ముందున్నారు. ట్రంప్‌ ట్రాక్‌ రికార్డ్‌ అంతా వివాదాలు, ఆరోపణల మయమే. అయినా సరే...ప్రచారంలో ట్రంప్‌ దూకుడుని బైడెన్‌ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌కి మరో సమస్య వచ్చి పడింది. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌...క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్‌ కేంద్రంగా నెగిటివిటీ పెరుగుతోంది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. డెలావెర్‌లోని విల్మింగ్టన్‌ కోర్టు జడ్జి మేరీఎల్లెన్‌ నోరీకా... హంటర్‌ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. కానీ ఈ తరహా కేసుల్లో 25 ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది. అదే సమయంలో తొలిసారి నేరానికి పాల్పడినందు వల్ల అంత శిక్ష పడక పోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్‌ డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్‌పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడానికి కొద్ది రోజుల ముందే...డోనాల్డ్‌ ట్రంప్‌ని హష్‌ మనీ కేసులో దోషిగా తేల్చింది మన్‌హట్టన్‌ కోర్టు. శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు... ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశార ని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్‌ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు. 2006 జులై లో ఒక చారిటీ గోల్ఫ్‌ ట్రోర్నమెంట్‌లో ట్రంప్‌ని ఒక చారిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో కలిసినట్టుగా డేనియల్స్‌ చెబుతున్నారు. లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనట్టు ఆమె తెలిపారు.2016 ఎన్నికల ముందు...ట్రంప్‌ లాయర్‌ కోహెన్‌...తనకు హష్‌ మనీ కింద ఒక లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్టు డేనియర్స్‌ తెలిపారు. అమెరికాలో రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని... డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్‌కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో... ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. అయితే ఈ చెల్లింపులతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.దోషిగా తేలడంతో ట్రంప్‌ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలే మని నిపుణులు అంటున్నారు. బిజినెస్‌ రికార్డులు తారుమారు అనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. అయితే, కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా, జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఇంత కంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్‌ న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఈ విషయంలో ట్రంప్‌కి గట్టిగానే మద్దతు తెలుపుతోంది.ట్రంప్‌ మద్దతుదారులు ఈ కేసును బైడెన్‌ రాజకీయ కుట్ర అంటారు, ట్రంప్‌ వ్యతిరేకులు ఆయనకు శిక్షపడినందుకు సంతోషిస్తారు. రాజకీయాన్ని అటుంచితే, మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్థుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్ఠలకు భంగకరమే అంటున్నారు పరిశీలకులు. అయితే...ఈ తరహా వివాదాలు, కేసులు, ట్రంప్‌కి కొత్త కాదు. ట్రంప్‌ని ఈ కోణంలో చూడటం అమెరికన్స్‌కి కొత్త కాదు. దీంతో...కోర్టు విధించే శిక్ష ఏంటి ? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అటు బైడెన్‌ కుమారుడు క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్‌ మీద ఆప్రభావం ఎంత వరకు పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Karnataka Government Raises Petrol And Diesel Prices
పెట్రోల్‌,డీజిల్‌ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్​ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.85చేరగా.. డీజిల్‌ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

TCS has 80000 job vacancies due to skill gap
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్‌ ఉన్నాయి.. కానీ..

ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్‌ గ్యాప్‌ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement