ర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్ మితిమీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. సమ్మె కార్మికుల హక్కు. అధికార అహంభావం కేసీఆర్ ప్రతి మాటలో కొట్టొచ్చినట్లు కనిపించింది.