లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రేడియో జాకీ ఫిర్యాదుతో ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే గజల్ శ్రీనివాస్‌ను రెండు వారాలపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Jan 2 2018 4:06 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement