సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సీకే జాఫర్ షరీఫ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నమాజ్ చేసేందుకు వెళుతూ కిందపడిన షరీఫ్‌ను శుక్రవారం బెంగళూర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. షరీఫ్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించినా ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మరణించారు.