అక్కినేని వారింట చిన్న కోడలుగా అడుగపెట్టబోయే చివరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి అయింది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్‌దిత్‌రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరి వివాహానికి రామ్ చరణ్ నుంచి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వరకు టాలీవుడ్ స్టార్లందరూ హాజరయ్యారు. శ్రియా, అనిన్‌దిత్ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు శ్రియా భూపాల్, అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌తో తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన చీరలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్‌దిత్, క్లాసిక్ శెర్వానీతో సింపుల్ లుక్‌లో కనిపించాడు.