పవన్‌ ఒక్కరికే ఫ్యాన్స్‌ ఉన్నారా.. | Tollywood Women Artists Says Sorry To Pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ ఒక్కరికే ఫ్యాన్స్‌ ఉన్నారా..

Apr 17 2018 7:34 AM | Updated on Mar 22 2024 11:31 AM

సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్‌కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement