బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఎంత మంచి డ్యాన్సరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్యాన్స్ చేయడంలో అతని టైమింగ్, స్టైల్ మిగతా వారి కన్నా కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తాయి. ఒక అవార్డ్సు ఫంక్షన్ లో రణ్‌వీర్ సింగ్ రామ్ లీలా చిత్రంలోని నగడా సాంగ్ డోల్ బాజేకు డ్యాన్స్ చేశాడు.రణ్‌వీర్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తూ షోలో ఉన్నవారిని అలరిస్తున్నాడు. ఇంతలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. అప్పటికే పాట కోసం స్టేజీపై పెద్ద డోల్స్ ఏర్పాటు చేశారు. రణ్‌వీర్ పాటకు స్టెప్పులేస్తూ డోల్స్ వాయిస్తుండగా..ఓ డోల్ పై ఉన్న క్లాత్ చిరిగిపోయింది. దీంతో రణ్‌వీర్ ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అప్పటివరకు పాటను ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులంతా అనుకోని ఘటన జరిగే సరికి షాక్ కు లోనయ్యారు. వెంటనే స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, సహాయకులు రణ్ వీర్ ను డోల్ లోపలి నుంచి బయటకు తీశారు. రణ్ వీర్ కు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్‌వీర్ నువ్వు మంచి డ్యాన్సర్ అని ఒప్పుకుంటాము.. కానీ ఓవర్ స్మార్ట్ తగ్గించుకుంటే మంచిది.. అయ్యో! పాపం రణవీర్.. తొందరగా పైకి లేపండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయ్యో ! రణ్‌వీర్ ఎంత పని జరిగే..
Apr 23 2020 6:22 PM | Updated on Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement