టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఒక హీరో అడియో ఫంక్షన్‌లకు మరొకరు హాజరవ్వడం, బయట పార్టీల్లో సందడి చేయడం, ఇతర హీరోల సినిమాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం చూస్తూనే ఉన్నాం. రంగస్థలం బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భరత్ అనే నేను చిత్ర నిర్మాత ఏర్పాటు చేసిన పార్టీలో ప్రిన్స్ మహేశ్ బాబు, మెగా హీరో రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ మధ్యే కాదు తమ కుటుంబాల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం ఉందనేలా చెర్రీ దంపతులు, ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు.