‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా’

'సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ టీజర్‌ వచ్చేసింది. ఊహించినట్టే అల్లు అర్జున్‌ మార్క్‌ స్టైల్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పవర్ ఫుల్‌ అండ్‌ కామెడీ పంచ్‌లతో టీజర్‌ సూపర్బ్‌గా ఉండటంతో క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉన్న ఈ చిన్న టీజర్‌ను చూస్తుంటే సినిమా భారీ హిట్‌ సాధించడం ఖాయంలా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మీ నాన్నా  పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్ను’అంటూ మొదలైన టీజర్‌ ఒక నిమిషం 23 సెకన్ల పాటు సాగింది. ‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’, ‘సమ్‌థింగ్‌ కంప్లీట్‌ అవ్వట్లేదు.. ఇన్ని పాటలతో ప్యాకప్‌ చేశాక.. డైలాగ్‌ లేదనా’, ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా’, అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌లు తెగ ఆకట్టుకుంటున్నాయి.  
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top