మళ్లీ జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకుంటారా? | Netizens Trolls On Aravinda Sametha Success Meet | Sakshi
Sakshi News home page

Oct 22 2018 3:36 PM | Updated on Mar 21 2024 10:48 AM

అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ రాకపై సోషల్‌ మీడియా వేదికగా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగాంగానే బాలకృష్ణ ఈ సక్సెస్‌ మీట్‌కు హాజరయ్యారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అభినందన సభలో బాలయ్య చేసిన వ్యాఖ్యల చుట్టూనే తీవ్ర చర్చ జరుగుతోంది. వేదికపై అందరి గురించి మాట్లాడిన బాలయ్య జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటతోనే సరిపెట్టడం జూనియర్‌ అభిమానులకు మింగుడుపడటం లేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement