హీరో నానికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

హీరో నానికి తప్పిన ప్రమాదం

Published Fri, Jan 26 2018 6:48 PM

సినీ హీరో నాని కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 3/పీపీడీఏ చట్టం (పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ డిస్ట్రక్షన్‌ యాక్ట్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాద ఘటనపై స్పష్టత లేదు.

Advertisement
Advertisement