రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం రియో పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. రియోలో పాల్గొననున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన కొన్ని రోజుల్లోనే, మరో ఆటగాడు డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు.