అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగిన తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదేనని, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.