సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యం కోసం కోర్టులను ఆశ్రయించిన సంగతిని శోభానాగిరడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం శోభానాగిరెడ్డి మాట్లాడుతూ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున తెలుగు ప్రజలకు శోభానాగిరెడ్డి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది రాష్ట్రాన్ని ముక్కలు చేయాడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అందులోభాగంగానే ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం నాటకాలు ఆడుతున్నారని శోభానాగిరెడ్డి మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలలో నిన్న వైఎస్ విజయమ్మ పర్యటన పట్ల రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలు ప్రవర్తించిన తీరు దారుణమని పేర్కొన్నారు.
Nov 1 2013 10:20 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement
