'ఈ గడ్డమీద పుట్టిన చంద్రబాబు విభజనకు సహకరిస్తున్నారు' | ys jagan samaikya sankaravam in kalikiri | Sakshi
Sakshi News home page

Jan 7 2014 8:44 PM | Updated on Mar 22 2024 11:32 AM

ఈ నడి రోడ్డుమీదకు వచ్చిన ప్రతీ పిల్లాడి గుండె చప్పుడు జై సమైక్యాంధ్ర అని నినదిస్తుంటే... రాష్ట్రంలో ఉన్న నాయకులకు కనీసం జ్ఞానం లేదన్నారు. విభజన జరిగితే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతీ రైతన్న ప్రశ్నిస్తుంటే ఈ నేతలు ఏ సమాధానం చెబుతారన్నారు. సోనియా గాంధీని కాలర్ పట్టుకుని అడగాల్సిన ఈ గడ్డమీద పుట్టిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విభజనకు సహకరించడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే వీగిపోతుందని భయపడి, నేరుగా పంపించి చర్చించుకోమని వదిలేశారన్నారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలను, తెలంగాణ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిపించుకుని తలో మాట చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement