ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్ | yoga guru Baba Ramdev beats Olympic medallist Andrey Stadnik in friendly match | Sakshi
Sakshi News home page

Jan 19 2017 6:04 AM | Updated on Mar 21 2024 8:44 PM

యోగా గురువు బాబా రాందేవ్ తాను విసిరిన సవాల్‌లో నెగ్గి భళా అనిపించుకున్నారు. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు విసిరారు. తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తానని, దానివల్ల ఎంతో శక్తి చేకూరుతుందని ముందుగానే హెచ్చరించిన రాందేవ్ బుధవారం రాత్రి ఆండ్రీ స్టాడ్నిక్‌ తో జరిగిన కుస్తీ పోటీలో గెలుపొందారు. ఈ బౌట్‌లో 12-0 పాయింట్లతో ఒలింపిక్ ప్లేయర్ ను ఓడించారు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించడంతో పాటు ఒలింపిక్ ప్లేయర్‌కు కనీసం ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. మ్యాచ్ ముగియగానే రాందేవ్‌ను విన్నర్‌గా ప్రకటించగానే భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement