: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దగా చేయబడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామిని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.