వాట్సప్ చాటింగ్ బాగా అలవాటైందా? అయితే... ఒకే రకం ఫాంటుతో చాట్ చేసి బోర్ కొడుతోంది కదూ.. అందుకే, మీ కోసమే ఫాంటు మార్చుకునే అవకాశాన్ని కూడా వాట్సప్ పరిశీలిస్తోంది. ఇక మీదట మీకు నచ్చినవాళ్లతో నచ్చిన ఫాంటులో చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర‍్లు వాడుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫాంట్లను ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు.