breaking news
font chage
-
ఈ ఫాంట్‌తో మతిమరుపుకు చెక్!
మార్కెట్‌కు వెళ్లి మీరనుకున్న కొన్ని వస్తువులు కొనడం మర్చిపోయారా? పరీక్షకు చదవాల్సిన ముఖ్యమైన పాఠాలు చదవడం మరిచిపోయారా? ఇలాంటి మతిమరుపులు మనల్ని నిత్యం ఇబ్బందికి గురి చేస్తూంటాయి కదా! అయితే ఇకపై ఆ ఆందోళన అవసరం లేదు. మనం చెయ్యాల్సిన పనులు పక్కాగా గుర్తించుకునేలా ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త ఫాంట్‌ను సృష్టించారు. ‘శాన్స్ ఫర్‌గెటికా’అనే ఈ ఫాంట్లో నోట్స్ రాసుకుంటే మనం చెయ్యాల్సిన పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమట! జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుంది ? మనం రోజూ పలు రకాల ఫాంట్లు వినియోగిస్తూంటాం. అందులో చూడడానికి అందంగా, కళ్లకి ఆహ్లాదంగా ఉండే ఫాంట్స్‌నే ఎంచుకుంటాం. అయితే మనం వాడే భాష, అవతలివాళ్లు ఏదైనా మాట్లాడితే మనం పెట్టే శ్రద్ధ, జ్ఞాపకశక్తి, అవగాహన, సృజనాత్మకత, ఆలోచన వంటి మానసిక సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఫాంట్లో ఏది రాసుకున్నా అంత తేలిగ్గా మర్చిపోకపోవడమే దీని ప్రత్యేకత! ఇతర ఫాంట్లతో పోల్చి చూసినా శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్లో రాసింది చదవడం చాలా కష్టం. అలా కష్టపడి, కూడబలుక్కొని చదవడం వల్ల ఎవరూ తొందరగా మర్చిపోరు. ఇది నిర్ధారించడానికి 400 మంది వర్సిటీ విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఇంగ్లిష్‌లో సాధారణంగా వాడే ఏరియల్ ఫాంట్లో రాసుకున్న విషయాలను 50 శాతం మంది గుర్తు పెట్టుకుంటే, అదే విషయాన్ని శాన్స్ ఫర్‌గెటికా ఫాంట్లో రాస్తే 57 శాతం మంది గుర్తుంచుకున్నారు. ఈ కొత్త ఫాంట్‌ను ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టి డిజైన్ చేశారు. మొదటిది అక్షరాలు కాస్త వెనక్కి వంపు తిరిగి ఉండటం అంటే మ్యాప్‌లో నదుల్ని గుర్తించడానికి వాడే డిజైన్ లాంటిదన్నమాట. ఇక రెండోది అక్షరానికి అక్షరానికి మధ్య ఉండే దూరం. ఈ ఫాంట్లో ఉంటే ప్రత్యేకమైన వంపు, దూరం కారణంగా చదవడం కష్టమే అయినా.. అది మెదడులో నిక్షిప్తం చేసుకోవడం సులభమవుతుందని ఈ ఫాంట్ డిజైనింగ్‌కు నేతృత్వం వహించిన స్టీఫెన్ బన్హమ్ పేర్కొన్నారు. మన కంప్యూటర్లలోనూ ఈ ఫాంట్‌ని డౌన్లోడ్ చేసుకొని జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుందో మీరూ పరీక్షించండి! -
చాటింగ్ కోసం వాట్సప్ కొత్త ఫీచర్
-
చాటింగ్ కోసం వాట్సప్ కొత్త ఫీచర్
వాట్సప్ చాటింగ్ బాగా అలవాటైందా? అయితే... ఒకే రకం ఫాంటుతో చాట్ చేసి బోర్ కొడుతోంది కదూ.. అందుకే, మీ కోసమే ఫాంటు మార్చుకునే అవకాశాన్ని కూడా వాట్సప్ పరిశీలిస్తోంది. ఇక మీదట మీకు నచ్చినవాళ్లతో నచ్చిన ఫాంటులో చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు వాడుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫాంట్లను ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. ఇది కూడా ఏమాత్రం ప్రచార ఆర్భాటం లేకుండా సైలెంటుగా ప్రవేశపెట్టిందట. విండోస్‌లో ఉండే ‘ఫిక్స్డ్సిస్’ లాగే ఈ కొత్త ఫాంట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ప్రస్తుతానికి ఈ కొత్త ఫాంటును వాడటం మాత్రం చాలా కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే, ఫాంటు మారాలంటే ఆ టెక్స్ట్‌కు ముందు, వెనక రెండుసార్లు బ్యాక్కోట్ (`) సింబల్‌ను యూజర్లు వాడాల్సి ఉంటుందట. అంటే మీరు ఎవరినైనా పలకరిస్తూ ఎలా ఉన్నారు అని కొత్త ఫాంటులో అడగాలంటే.. ```ఎలా ఉన్నారు``` అని టైప్ చేయాలన్న మాట. అయితే, పాత ఫాంటుతో పోలిస్తే కొత్త ఫాంట్ మాత్రం అక్షరాలు కొంత చిన్నగా కనపడుతున్నాయని యూజర్లు అంటున్నారు. అలాగే ప్రతిసారీ ఇలా కోట్స్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా ఫాంట్ మార్చుకునే పద్ధతి ఉంటే చూడాలని కోరుతున్నారు. అలాగే బోల్డ్, ఇటాలిక్స్ లాంటివి పెడితే ఫాంటు మారట్లేదట. ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్‌లోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఐఓఎస్‌లో కూడా వస్తుందని చెబుతున్నారు.