పెద్దల సభలో గందరగోళం చెలరేగింది. పశ్చిమబెంగాల్‌లో సైన్యం మోహరింపు విషయమై మొదలైన వివాదం చివరకు సభ్యులు తీవ్ర పదజాలం ఉపయోగించేవరకు వెళ్లింది. టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ దీనిపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నప్పుడు.. అధికార పక్షం నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో ఆయన ఆవేశం పట్టలేకపోయారు.