ముంబయిలో బుధవారం రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. బల్లార్డ్ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నాలుగవ అంతస్థులో అగ్నిప్రమాదం జరిగింది మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా అంధేరిలో మరో ప్రమాదం జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో జరిగిన అగ్నిప్రమాదంలో 13మంది గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.