breaking news
mumbai fire accident
-
ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబయి : బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ముంబయి అగ్ని ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి కారణం జనాభా అన్నారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయిలోని కమలామిల్స్ కాంపౌండ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 14మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులతో హేమమాలిని పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ 'పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదు. వారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అగ్నిప్రమాదంలో ఇద్దరు ఫైర్మెన్ మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఎన్ దేశాయ్, ఎస్డబ్ల్యు రాణే అనే ఇద్దరు పూర్తిగా కాలిపోయి మరణించినట్లు అగ్నిమాపక బృందం తెలిపింది. ముంబై కల్బాదేవి ప్రాంతంలోని ఓ నివాస భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు ఫైరింజన్లు వెళ్లాయి. అయితే అదే మంటల్లో ఫైర్ సిబ్బంది కూడా చిక్కుకున్నారు. దాదాపు 80 శాతం వరకు కాలిన గాయాలు అయిన వాళ్లను అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భవనం శిథిలాల నుంచి బయటకు తీశారు. ఇదే ఘటనలో ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ నెస్రికర్, మరో సీనియర్ అధికారి ఎస్.జి అమీన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ నవీముంబైలోని నేషనల్ బర్న్స్ సెంటర్కు తరలించారు. -
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం