అవిభక్త కవలలు వీణావాణీలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీరిని తరలించడం చర్చనీయాంశంగా మారింది. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీణావాణీలను ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు పంపించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణ, వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.