ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో ఇన్ని రోజులు ప్రముఖ నేతలు, ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రభుత్వాలకు సహకరించే వారు ఉండేవారు. కానీ తాజాగా న్యూస్ ప్రజెంటర్లను కూడా ఐసిస్ టార్గెట్ చేసింది. బీబీసీ, స్కై న్యూస్ లోని ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ జర్నలిస్టులను ఐసిస్ టార్గెట్ చేసినట్టు తెలిసింది. న్యూస్ రీడర్స్ పై అటాక్ చేయడంతో పాటు, వారి ఆఫీసు ప్రాంగణాల్లో కూడా దాడులు నిర్వహించేందుకు పన్నాగం పన్నుతుందని డైలీస్టార్ రిపోర్టు చేసింది. వారిని అలర్ట్ చేయాలని పోలీసులను తాము ఆశ్రయించామని, కౌంటర్ టెర్రరిజం అధికారులు ఈ కేసులను విచారణకు స్వీకరించినట్టు డైలీ స్టార్ పేర్కొంది.