వినాయక మంటపం వద్ద షాక్ : ఇద్దరు మృతి | Two youth die of electrocution | Sakshi
Sakshi News home page

Sep 15 2015 3:41 PM | Updated on Mar 21 2024 6:13 PM

వినాయకచవితి ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక మంటపం వద్ద విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృత్యువు పాలయ్యారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కొందరు యువకులు వినాయక ఉత్సవాల సందర్భంగా మంటపం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం లైన్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై నిమ్మల నరేష్, ఎం.పరశురాములు అనే యువకులు చనిపోయారు. మృతులు బావాబామ్మర్దులుగా సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement