దేశంలోని నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. డీమానిటైజేషన్ కారణంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు లభిస్తున్న ప్రోత్సాహం లాంటి ఇతర కారణాలల మూలంగా టెలికాం రంగంలో నిపుణుల అవసరం బాగా పెరగనుందని , దీంతో ఈ ఏడాది సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.