పశ్చిమగోదావరి జిల్లా వాసులను వణికిస్తున్న ఇంజక్షన్ దాడులు హైదరాబాద్ కూ పాకాయి. మల్కాజ్‌గిరిలో నాలుగో తరగతి విద్యార్థిని రమ్యపై ఇంజక్షన్ దాడి జరిగింది. శనివారం ఉదయం రమ్య స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ఆమెకు ఇంజక్షన్ గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు లిల్లీపుట్ మోడల్ స్కూల్లో చదువుతోంది. రమ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.